Sunday, November 23, 2008

వర్డ్ ప్రెస్ వెబ్ సైట్ నిర్వహణ కు సహాయం,సూచనలు కావాలి


నేను ఇటీవలే http://www.vizagdaily.co.cc/ అన్న ఒక వెబ్ సైట్ ను ప్రారంభించాను,తెలుగు యూనికోడ్ ఫాంట్స్ తో,ప్రస్తుతం రోజుకు ఒకటీ రెండు వార్తలు/వ్యాసాలు ఇందులో జతచేస్తున్నాను.కానీ డైలీ కాబట్టి వీలయినంత త్వరలో ప్రతి రోజూ సాధ్యమైనన్ని వార్తలు అందించాలని ప్రత్యత్నిస్తున్నాను.అయితే ఈ వెబ్ సైట్ నిర్వహణ అంతా వర్డ్ ప్రెస్ కి సంబంధించింది.నేను ఇప్పటి వరకూ నా బ్లాగులన్నీ బ్లాగరు లోనే నడుపుతున్నాను.అయితే పత్రికకు కావాల్సిన థీమ్స్,టెంప్లేట్ వగైరాలు వర్డ్ ప్రెస్ లోనే ఉండటం వల్ల దాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది.కానీ వర్డ్ ప్రెస్ నిర్వహణ నాకు కొంత ఇబ్బంది కరంగా ఉంది,అసలు ఏమాత్రం పరిచయం అనుభవం లేకపొవటం వల్ల.
నాకు కింది అంశాలలో మీ సూచనలు కావాలి
అ.వర్డ్ ప్రెస్ గురించి మన తెలుగు బ్లాగర్లు ఎవరన్నా విపులమైన టపాలు రాసారా?
ఆ.వర్డ్ ప్రెస్ థీం,టెంప్లేట్ లాంటివి బ్లాగర్ లో దొరుకుతాయా?మ్యాగ జైన్ కు అనుగుణంగా
ఇ.ఈ రెంటికీ మధ్య ఫొలికలు,తేడాలున్నాయా?
ఈ.scribefire గురించి ఎవరన్నా వివరించగలరా? ఎందువల్లో ఈ సదుపాయానికి ప్రచారం లేకుండా పోయింది?
ఎ.కొత్తగా రూపొందించిన తెలుగు వెబ్ సైట్లను అంతర్జాలం లో తెలుగువారందరికీ తెలిసేలా ఎలాంటి పనులు/ఎక్కడ చేయాల్సుంటుంది?

1 comment:

Shiva Bandaru said...

వర్డ్ ప్రెస్ అనేది రెండురకాలు .

1.స్వంతంగా మీసై్ట్ లో స్తాపించుకునేది . ఇది ఓపెన్‌సోర్స్ స్క్రిప్ట్ . ఇందులో మీకు నచ్చిన విదంగా మార్పులు చేర్పులు చేసుకోవచ్చు .

2.వర్డ్ ప్రెస్ ని హోస్ట్ చేసి అందించేది వర్డ్ ప్రెస్.కాం . ఇందులో మీరు ప్రకటనలు పెట్టరాదు . (అంటే కమర్సియల్ గా ఉపయోగించరాదు .) అలా చెయ్యలనుకుంటే సుమారు 400$ వరకు నెలకు పీజు కట్టాలి .

3.గూగిల్ వారి బ్లాగర్ ని కమర్సియల్‌ గా ఉపయోగించుకోవచ్చు . అయితే బ్లాగర్ లో ఉన్న సదుపాయాలు వర్డ్ ప్రెస్ తో పోల్చితే చాలా తక్కువ .

4.మీ వెబ్ సైట్ / బ్లాగుకి సీరియస్ నెస్ రావాలంటే స్వంత డొమైన్‌ ఉండాలి .

5.scribefire ఆప్లైన్‌బ్లాగింగ్ టూల్ . దీనికి ప్రచారం బాగానే ఉంది .

6.గూగిల్‌ , యాహూలలో ప్రకటనలు ఇవ్వడమే .